ePaper
Friday, April 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లఅక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు

📰 Generate e-Paper Clip

*అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న సిరిసిల్ల పోలీసుల.*

•19,008/- రూపాయల విలువ గల(17.28లీటర్ల) మద్యం,

•••ద్విచక్ర వాహనం, ఫోన్లు సీజ్ నలుగురుపై కేసు నమోదు.

•••మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, డబ్బు రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు.

•••వివరాలు వెల్లడించిన సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కే.కృష్ణ.

*రాజన్న సిరిసిల్ల//ప్రజాదివాస్ :  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ను ప్రలోభ పెట్టడానికి 19008/-మద్యాన్ని, మోటర్ సైకిల్ ఒక ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని పట్టణ సిఐ కృష్ణ వివరాలను వెల్లడించారు. ఈసందర్భంగా *ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ….

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం మేరకు సిరిసిల్లలోని సుభాష్ నగర్ కి వెళ్ళగా నిందితుడు రాచమల్లు రాము అనే వ్యక్తి శనివారం తన మోటార్ సైకిల్ పై 19,008/-రూపాయలు విలువగల రాయల్ స్టాగ్ విస్కీ 180 ఏం. ఎల్ (96) మద్యం సీసాలను పెట్టుకొని 5వ వార్డ్ ఓటర్లలకు పంచడానికి వెళుతున్నడని ఈ మద్యం సీసాలు 5వ వార్డ్ నుండి బి ఆర్ ఎస్ పార్టి తరుపున పోటి చేస్తున్న దార్నం అరుణ,దార్నం లక్ష్మినారాయణ గురించి తన భర్త దార్నం లక్ష్మినారాయణ మద్యం సీసాలను పంచుటకి తేమ్మనగా తిసుక వెల్తున్నని చెప్పగా పంచుల సమక్షంలో మద్యం సీసాలను, మోటార్ సైకిల్ ను స్వాదినం చేసుకొని నిందితుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది అని తెలిపినారు.

 

*ఓటర్లను ప్రలోభ పెడితే చర్యలు తప్పవు*…

 

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

 

*నిందితుల వివరాలు:*…

 

1. దార్నం అరుణ, దార్నం లక్ష్మినారాయణ, సుభాష్ నగర్ సిరిసిల్ల.2. దార్నం లక్ష్మినారాయణ, సుభాష్ నగర్ సిరిసిల్ల.3. మల్లికార్జున వైన్స్ పాత బస్టాండ్ సిరసిల్ల.4.రాచమల్లు రాము, దేవదాస్, 26 సం లు, r/o సుభాష్ నగర్ సిరిసిల్ల..

 

*స్వాదినపరుచుకోన్నవి*..

 

1.రాయల్ స్టాగ్ విస్కీ -180 ఏం ఎల్ మద్యం సీసాలు (96),2. మోటార్ సైకిల్ టీ ఎస్ 23 ఏ 6196.

3. ఒక స్మార్ట్ ఫోన్. లు సిరిసిల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!