ఏప్రిల్ 14 న జోన్ లెవెల్ లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మా ఫూలే మైదానం లో జరిగే డాక్టర్ అంబేద్కర్ జయంతి ని విజయవంతం చేయాలని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఈ రోజు నిజామాబాదు పార్లమెంట్ కేంద్రం లో హోటల్ కపిల జరిగిన పార్లమెంటరి స్థాయి కార్యకర్తల సమావేశం కి అయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. ముందుగా మహనీయులకు పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ను బీజేపీ రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. రాజ్యాంగం రద్దు అయితే మనకు బ్రతుకు లేదని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం బహుజన్ సమాజ్ పార్టీ పని చేస్తుందని అన్నారు. అందుకే ఏప్రిల్ 14 నాడు కరీంనగర్ కి వేలాదిగా తరలి రావాలని అన్నారు. ఈ సమావేశం కి జోన్ ఇంచార్జ్ ఎనగందుల వెంకన్న సభద్యక్షత వహించగా జోన్ ఇంచార్జ్ గైని గంగాధర్ పార్లమెంట్ ఇంచార్జ్ లు డాక్టర్ నీరడి లక్ష్మణ్, గండికోట రాజన్న జిల్లా అధ్యక్షులు సింగడే పాండు జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ షకీల్ సీనియర్ నాయకులు కొమిరే సుధాకర్ అన్ని అసెంబ్లీ ఇంచార్జ్ లు అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇట్లు
ఎనగందుల వెంకన్న
నిజామాబాదు జోన్ ఇంచార్జ్