••ఈనెల 12న కరీంనగర్‌లో భారీ సభ.. పాల్గొననున్న మందకృష్ణ మాదిగ
దళిత క్రైస్తవులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించనున్న “దళిత క్రైస్తవుల హక్కుల సమ్మేళనం”కు పెద్ద ఎత్తున హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని క్రైస్తవులు అందరూ కుల, మత భేదాలు లేకుండా సభకు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకు చెందిన క్రైస్తవులు ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఎస్సీ క్రైస్తవులపైనే వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే దళిత క్రైస్తవుల హక్కులను అణగదొక్కే కుట్ర చేస్తోందని విమర్శించారు.
దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పరిధిలో వచ్చిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏ bhi రాజకీయ పార్టీ నాయకుడు కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు.
“మన హక్కులను మనమే కాపాడుకోవాలి.. అందరం ఒక్కటిగా పోరాడుదాం” అని సభ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బులుమల్ల జీవన్ ఇండియా ప్రెసిడెంట్. కుమ్మరి రాజేష్. పసుల ప్రసాద్. అక్కనపెల్లి అహరోను. ఏంటిది . జింక పాల్. దాసరి జోసెఫ్. బండి డేవిడ్. దుబ్బల ఆనందం. గద్దల కిషన్. మచ్చ నర్సింగం. సడిమెల శోభారాణి. ఎనగందుల బిక్షపతి. ఆవునూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు