prajadivaas.in
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 3:20 am Digital Edition : PRAJA DIVAAS MEDIA

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా

సిరిసిల్ల మాస్టర్ మైండ్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తు జాగ్రత్తలపై ఫైర్ అధికారి నరేందర్ ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో భయపడకుండా ఉండడం, వెంటనే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవడం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వినియోగంపై ప్రాథమిక సూచనలు ఇచ్చారు. ఇంటి వద్ద, పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్యామ్, లీడింగ్ ఫైర్ ఫైటర్ నరసింహచారి, సిబ్బంది సాగర్ రెడ్డి, అనిల్, సాయికిరణ్, రాహుల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.