తెలంగాణ లో బహుజన రాజ్యం సాధించినపుడే మాన్యవర్ కాన్షిరామ్ గారికి నిజమైన నివాళి బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్
తెలంగాణలోబహుజనరాజ్యం సాధించినపుడే మాన్యవర్ కాన్షిరామ్ గారికి నిజమైననివాళి అని బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో జోన్ స్థాయి లోజరిగిన మాన్యవర్ కాన్షిరామ్ గారి 92 వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార సంకల్ప సభ కి చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం తో కలిసి అయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. మాన్యవర్ కాన్షిరామ్ గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత దేశం లో అణగారిన కులాలకు రాజకీయ కాంక్ష ను రగిలించి మన మహాపురుషులైన మహాత్మా ఫూలే సాహుమహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ లు ప్రారంభించిన సామజిక పరివార్తన ఉద్యమాన్ని కొనసాగించేందుకు అయన తన సర్వస్వం దారబోసి బహుజన ఉద్యమాన్ని నిర్మించి బహుజనులకు రాజకీయ అధికారాన్ని అందించిన గొప్ప మహానుభావుడు మాన్యవర్ కాన్షిరామ్. ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ ని అధికారం లోకి తీసుకవచ్చి బెహన్ జీ మాయావతి గారిని 3 సార్లు ముఖ్యమంత్రి ని చేసినాడు. బహుజన కులాలకు రాజకీయ చైతన్యం ను రాజకీయ కాంక్ష ను రగిలించేందుకు ఓట్లు మావి సీట్లు మీవా ? , ఎవరి జనాభా ఎంతో వారికీ అంతా వాటా అని చెప్పి అక్కడ అమ్ముడు పోయే సమాజాన్ని అమ్ముడు పోనీ సమాజం గా మార్చి రాజ్యాధికారం సాధించిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు. ఇప్పుడు దేశం లో కాంగ్రెస్ బీజేపీ లు బహుజనుల బ్రతుకులను నాశనం చేస్తున్నాయి అని అన్నారు. అందుకే 78 సంవత్సరాల నుండి మన బ్రతుకులు మారకపోవడానికి కాంగ్రెస్ బీజేపీ పార్టీ లే అని అన్నారు. తెలంగాణ లో బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేసి రాజ్యాధికారం సాధించినపుడే అయన ఆశయాలు నెరవేరుతాయి అని అన్నారు. ఈ బహిరంగ సభ లో చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం, సభాధ్యక్షులు జోన్ ఇంచార్జ్ ఎనగందుల వెంకన్న, మాతంగి అశోక్, నీరడి ఈశ్వర్ కళ్ళేపెల్లి రాజేందర్, దొడ్డే సమ్మయ్య, పల్లె ప్రశాంత్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కొమ్మట అశోక్, అన్ని జిల్లా ల ఇంచార్జ్ లు అధ్యక్షులు వివిధ అసెంబ్లీ ల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.