ePaper
Sunday, June 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లసిరిసిల్లలో గాంధీ విగ్రహం కనిపించకుండా ప్లెక్సీలు…

సిరిసిల్లలో గాంధీ విగ్రహం కనిపించకుండా ప్లెక్సీలు…

📰 Generate e-Paper Clip

సిరిసిల్లలో గాంధీ విగ్రహం కనిపించకుండా ప్లెక్సీలు…•• వివాదంగా మారిన మాల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల /ప్రజాదివాస్ : సిరిసిల్ల పట్టణంలో రేపు ప్రారంభంకానున్న వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నేడు పట్టణమంతా విస్తృతంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గాంధీ విగ్రహం ఎదుట కూడా భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం పూర్తిగా కనిపించకుండా ప్లెక్సీలు కప్పివేయడం పట్ల పలువురు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నాయకుడి విగ్రహాన్ని అవమానించే విధంగా ఏర్పాట్లు చేయడం సరైంది కాదని సామాజిక వర్గాలు విమర్శిస్తున్నాయి.

మాల్ ప్రారంభోత్సవం కోసం భారీ స్థాయిలో అలంకరణలు, ఆహ్వాన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, ప్రజా ప్రదేశాల్లో నియమాలను పాటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విగ్రహాల వద్ద రాజకీయ, వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయంపై మున్సిపల్ అధికారులు స్పందించి, గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రేపటి ప్రారంభోత్సవానికి ముందు ఈ వివాదంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!