ePaper
Friday, April 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లకలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరిమ అగ్రవాల్*

కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరిమ అగ్రవాల్*

📰 Generate e-Paper Clip

* శుభాకాంక్షలు తెలియజేసిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -26 : జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ గా గరిమ అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జి కలెక్టర్ గా గరిమ అగ్రవాల్ అక్టోబర్ 23 వ తేదీ 2025 న బాధ్యతలు స్వీకరించారు. గరిమ అగ్రవాల్ గారిని కలెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కు అర్చకులు ఆశీర్వచనం అందించారు.

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఏవో రామ్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రావణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!