తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా వట్టిమల్ల గ్రామంలో పాలు కార్యక్రమాలు
కోనరావుపేట జూన్ 3 ప్రజా దివాస్
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వట్టిమల్ల గ్రామంలో గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో పలు సేవా, క్రీడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి గ్రామ పాలకవర్గం తరఫున నూతన దుస్తులను అందజేయడం జరిగింది. గ్రామ పరిశుభ్రత, అభివృద్ధి మరియు ప్రజా సేవలో వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు.
అదేవిధంగా గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు గౌరవ సర్పంచ్ శ్రీ గుండా వెంకటేష్ గారు, ఉప సర్పంచ్ శ్రీ గంగారం సంపత్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్‌లో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
గ్రామ అభివృద్ధి, యువత ప్రోత్సాహం మరియు సామాజిక సేవల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న సర్పంచ్ గుండా వెంకటేష్ గారు, ఉప సర్పంచ్ గంగారం సంపత్ గారు మరియు గ్రామ పాలకవర్గ సభ్యుల సేవలు అభినందనీయమైనవి.
“గ్రామ అభివృద్ధే మా లక్ష్యం యువత ప్రగతే మా సంకల్పం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న వట్టిమల్ల గ్రామం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ…
