ePaper
Sunday, June 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లచంద్రగిరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు

చంద్రగిరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రగిరి గ్రామంలోని తాత్కాలిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు గ్రామ సమగ్ర పురోగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేశభక్తి నినాదాలు మార్మోగాయి.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు పూసాల సంతోష్, ఎడెల్లి మరియా మల్లయ్య, ముద్దంగుల అంజయ్య, ఎడెల్లి లక్ష్మి, ఎడెల్లి సుదర్శన్, గ్రామ కార్యదర్శి నిట్టు నరేష్ కుమార్, హెచ్‌ఎం శ్రీలత, మహిళా అధ్యక్షురాలు సందెల మిరియా, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు మంద పద్మ, మాజీ సర్పంచ్ గర్రెపల్లి వెంకటి గౌడ్, రుద్రవేణి నాగరాజు, బూర శేఖర్, న్యాత నర్సయ్య, అంజయ్య, ఈర్నాల అశోక్, గుండం నరేష్, చోటు, బలాగోని రవీందర్ గౌడ్, ముత్త మోహన్‌తో పాటు మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!